హైదరాబాద్ హౌస్ లో మోదీ-ఒబామా చర్చలు | inside hyderabad house, barack obama and narendra modi | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ హౌస్ లో మోదీ-ఒబామా చర్చలు

Jan 25 2015 2:02 PM | Updated on Aug 8 2018 6:12 PM

హైదరాబాద్ హౌస్ లో మోదీ-ఒబామా చర్చలు - Sakshi

హైదరాబాద్ హౌస్ లో మోదీ-ఒబామా చర్చలు

భారత్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ హౌస్ లో చర్చలు జరుపుతున్నారు.

న్యూఢిల్లీ: భారత్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ హౌస్ లో చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు రాజ్ ఘాట్ కు చేరుకున్న ఒబామా.. అక్కడి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు.  బాపూ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు.

 

అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు. అనంతరం పియూష్ గోయల్ తదితరులకు అభివాదం చేసి అక్కడి నుంచి హైదరాబాద్ హౌస్ కు బయల్దేరి వెళ్లారు.ప్రస్తుతం మోదీతో కలిసి ఇక్కడ చర్చలు జరుపుతున్న ఒబామా.. గం.2.45 ని.లకు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement