ఆ ఏనుగు చనిపోయింది | Injured elephant dies during treatment in Mudumalai | Sakshi
Sakshi News home page

ఆ ఏనుగు చనిపోయింది

Jul 6 2016 2:38 PM | Updated on Sep 4 2017 4:16 AM

ఆ ఏనుగు చనిపోయింది

ఆ ఏనుగు చనిపోయింది

దేశవ్యాప్తంగా ప్రమాదాల్లో ఏనుగులు చనిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

ఉదగమండలం: దేశవ్యాప్తంగా ప్రమాదాల్లో ఏనుగులు చనిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన గజరాజు చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. సోమవారం కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలో రోడ్డు దాటుతుండగా 10 ఏళ్ల వయసున్న ఏనుగును ఆర్టీసీ బస్సు ఢీకొంది. దాని కుడి కాలికి, వెన్నుముఖకు గాయలయ్యాయి.

తీవ్రంగా గాయపడిన ఏనుగును మెరుగైన చికిత్స కోసం మదుమలైలోని తెప్పక్కాడ్ ఎలిఫెంట్ క్యాంప్ కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఏనుగు మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు గత 15 రోజుల్లో తమిళనాడు అడవుల్లో వరుసగా ఐదు ఏనుగులు అనారోగ్య కారణాలతో మరణించడం పట్ల జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement