భారత్‌ ప్రతీకార దాడి: నలుగురు పాక్‌ సైనికుల హతం

Indian Army Retaliatory Firing 4 Pakistani Soldiers Killed - Sakshi

పూంచ్‌(జమ్మూ కశ్మీర్‌) :  పాకిస్తాన్‌ ఆర్మీ రెచ్చగొడ్డుటు చర్యలకు భారత్‌ మరోసారి గట్టిగా సమాధానం చెప్పింది. ఈ శుక్రవారం పూంచ్‌ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి భారత్‌ జరిపిన ప్రతీకార కాల్పుల్లో నలుగురు పాక్‌ సైనికులు చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌ ఆర్మీ స్థావరాలు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కాగా, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ పాక్‌ బలగాలు ఆరు రోజుల వ్యవధిలో మూడు సార్లు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపాయి. నిన్న నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ జరిపిన కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. దాయాది దేశం‌‌ దాడిలో ఓ జమ్మూకశ్మీర్‌ పౌరుడు గాయాలపాలయ్యాడు.

చదవండి : భారత్‌పై ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర ఆరోపణలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top