కరోనా ప్రమాదం : మన ర్యాంకు ఎంతంటే?

India ranks 17th among countries at risk of coronavirus import - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న కరోనా వైరస్‌ ప్రమాదంపై ఒక సంచలన పరిశోధన వెలుగులోకి వచ్చింది. చైనాలోని వ్యూహాన్‌ నగరంనుంచి విస్తరిస్తున్న ఈ మహమ్మారి బారిన పడే  ముఖ‍్యమైన దేశాల జాబితాను ‘మోడల్’  నెట్‌వర్క్ పరిశోధకులు వెల్లడించారు. ఈ జాబితాలో ఇప్పటికే  3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన  భారత ర్యాంకు 17 గా వెల్లడించింది. 

గ్లోబల్ నావల్‌ కరోనావైరస్ కేసులను అంచనా వేయడానికి  హంబోల్ట్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ‘మోడల్‌ నెట్‌వర్క్‌’ ద్వారా  అధ్యయనం నిర్వహించారు.  ప్రపంచవ్యాప్తంగా 4 వేల విమానాశ్రయాలు, 25వేలకు ప్రత్యక్ష సంబంధమున్న మార్గాల్లో  ఈ పరిశోధన నిర్వహించింది.  దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వైరస్ వ్యాప్తి  ప్రధానంగా వైమానిక ప్రయాణ ప్రయాణీకుల ద్వారా వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని  తేల్చారు. ముఖ‍్యంగా దేశంలో  ఢిల్లీని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ టాప్‌ రిస్క్‌లో వుండగా, ముంబై, కోలకతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోచి  ఆ తరువాత వరుసలో వుంటాయని పరిశోధకులు తెలిపారు. పరిశోధనల అంచనా ప్రకారం కరోనావైరస్  సోకే ప్రమాదమున్న మొదటి 10 దేశాలుగా  థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, తైవాన్, అమెరికా, వియత్నాం, మలేషియా, సింగపూర్,  కంబోడియా  ఉన్నాయి.  థాయిలాండ్‌కు ఈ  ముప్పు 2.1 శాతం కాగా, ఇది భారతదేశానికి 0.2 శాతం అని పరిశోధనలో తేలింది.

కాగా చైనాలోని ఏడవ అతిపెద్ద నగరం వుహాన్కరోనా వైరస్  కారణంగా మరణించిన వారి సంఖ్య 1000కి  పైమాటే. గతంలో (2003)ప్రపంచాన్ని వణికించిన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్‌) సార్స్‌ కంటే  కరోనా తీవ్రమైన మహమ్మారి ప్రమాదకరంగా పరిణమించింది. సుమారు 20 దేశాలు  కరోనా కేసులను ధృవీకరించినప్పటికీ, వ్యాధి సోకిన వారిలో చైనా 99 శాతం మంది ఉన్నారు.  కరోనా బారిన పడి మొదటి విదేశీ బాధితులు ఇద్దరు వుహాన్‌లోశనివారం మరణించిన సంగతి  తెలిసిందే. 

 చదవండి :  ఓ చైనా మహిళ ఆవేదన : ప్రపంచానికి సూటి ప్రశ్న! 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top