అలీగఢ్ వర్సిటీ పిటిషన్ ఉపసంహరణ | In U-turn, Centre tells SC it can’t grant AMU minority tag | Sakshi
Sakshi News home page

అలీగఢ్ వర్సిటీ పిటిషన్ ఉపసంహరణ

Published Fri, Jul 8 2016 8:13 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM

ఏఎంయూ మైనార్టీ సంస్థ కాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ యూపీఏ హయాంలో వేసిన పిటిషన్‌ను కేంద్రం ఉపసంహరించుకుంది.

న్యూఢిల్లీ: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మైనార్టీ సంస్థ కాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ యూపీఏ హయాంలో వేసిన పిటిషన్‌ను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వెల్లడించారు. ‘ఏఎంయూను ముస్లింలు గానీ, ప్రభుత్వం గానీ నెలకొల్పలేదు.

ఇది మైనార్టీ సంస్థ కాదని, సెంట్రల్ యూనివర్సిటీ మాత్రమేనని 1967లో అజీజ్ బాషా కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరించి పిటిషన్‌ను ఉపసంహరించుకొంటున్నట్టు సుప్రీంకోర్టుకు విన్నవించాం’ అని ఏజీ తెలిపారు. 1981లో ఏఎంయూకు మైనార్టీ సంస్థ హోదా కల్పిస్తూ తీసుకువచ్చిన సవరణలు చట్ట విరుద్ధమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కాదనలేమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement