చిదంబరం తప్పించుకోలేరు | I have been vindicated: Chidambaram | Sakshi
Sakshi News home page

చిదంబరం తప్పించుకోలేరు

Jun 17 2016 3:31 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసు పత్రాల అదృశ్యానికి సంబంధించి మీడియా బయటపెట్టిన ‘సాక్షికి శిక్షణ’ ఆధారాలు...

ఇష్రాత్ కేసుపై బీజేపీ
న్యూఢిల్లీ: ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసు పత్రాల అదృశ్యానికి సంబంధించి మీడియా బయటపెట్టిన ‘సాక్షికి శిక్షణ’ ఆధారాలతో నాటి హోంమంత్రి చిదంబరం తప్పించుకోలేరని బీజేపీ స్పష్టం చేసింది. ఇషత్ ఉగ్రవాదన్న నిజాన్ని దాయడానికే ఆయన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మార్పులు చేశారని ఆరోపించింది. కేసు ‘డాక్యుమెంట్ల మిస్సింగ్’పై విచారణ జరుపుతున్న అదనపు కార్యదర్శి బీకే ప్రసాద్ గురువారం తన నివేదికను సమర్పించారు.

అయితే ప్రసాద్... ‘పత్రాల అదృశ్యం’పై విచారణలో ఏం అడుగుతారు... ఏం సమాధానం చెప్పాలన్నది 2011లో హోం శాఖ డెరైక్టర్ అశోక్‌కుమార్‌కు బోధిస్తున్నట్టు ఆంగ్ల పత్రిక ఒకటి ఆధారాలతో బయటపెట్టింది. వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియోను తన వెబ్‌సైట్‌లో ఉంచింది.  కాగా,  ఈ కేసులో బీజేపీ ప్రభుత్వం తప్పుడు వివాదాలను రేపుతోందని చిదంబరం ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement