'సీమాంధ్ర కాంగ్రెస్ ధర్నాలో పాల్గొనడం లేదు' | I don't want to participate in seemandhra congress dharna , say dokka manikya varaprasad | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర కాంగ్రెస్ ధర్నాలో పాల్గొనడం లేదు'

Aug 12 2013 4:12 PM | Updated on Sep 1 2017 9:48 PM

రేపు ఢిల్లీలో సీమాంధ్ర కాంగ్రెస్ నిర్వహించనున్న ధర్నాలో తాను పాల్గొనడం లేదని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు.

ఢిల్లీ: రేపు ఢిల్లీలో సీమాంధ్ర కాంగ్రెస్ నిర్వహించనున్న ధర్నాలో తాను పాల్గొనడం లేదని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. ఆంటోని కమిటీ ముందు రాష్ట్ర విభజన సమస్యలను మాత్రమే వివరిస్తానన్నారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమ జ్వాలలు ఎగసి పడుతున్న తరుణంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డొక్కా మాణిక్య ప్రసాద్.. కాంగ్రెస్ ధర్నాలో తాను పాల్గొనడం లేదని తెలిపారు.

 

ఆంటోని కమిటీ ముందు సీమాంధ్రపై స్పష్టత ఇవ్వాలని,  ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో వివరించాల్సిందిగా కోరతానని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement