కారులోకి దూసుకొచ్చిన అశ్వం | horse crashed into moving car | Sakshi
Sakshi News home page

కారులోకి దూసుకొచ్చిన అశ్వం

Jun 5 2017 9:49 PM | Updated on Sep 5 2017 12:53 PM

కారులోకి దూసుకొచ్చిన అశ్వం

కారులోకి దూసుకొచ్చిన అశ్వం

సాధారణంగా రోడ్డు ప్రమాదాలు కార్లు, ఆటోలు, బస్సుల వంటివి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నప్పుడో, లేదా అవి మనుషులపైకి వచ్చినప్పుడో జరుగుతుంటాయి.

జైపూర్‌:
సాధారణంగా రోడ్డు ప్రమాదాలు కార్లు, ఆటోలు, బస్సుల వంటివి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నప్పుడో, లేదా అవి మనుషులపైకి వచ్చినప్పుడో జరుగుతుంటాయి. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో మాత్రం ఓ వింత రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గుర్రం రోడ్డుపై వెళ్తున్న కారు అద్దం పగులగొట్టుకుని అందులోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో గుర్రంతోపాటు కారు డ్రైవర్‌కూ గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం రోడ్డుపై వెళ్తుండగా ఆ గుర్రానికి ఏమైందో ఏమోగానీ ఉన్నట్టుండి ఎదురుగా వస్తున్న కారుపైకి దూకింది. ఓ వైపు ఎండ వేడిమి, మరోవైపు రోడ్డుపై వాహనాలు చేసే శబ్దాల వల్ల గుర్రానికి చిర్రెత్తుకొచ్చి కారులోకి దూకి ఉంటుందని భావిస్తున్నారు. అశ్వం కారులోనే ఇరుక్కుపోగా స్థానికులు, అటవీశాఖ అధికారులు కలిసి దానిని రక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement