హత్య కేసులో హిందూ రాష్ట్ర సేన కార్యకర్తల అరెస్టు
పుణేలో ఒక యువకుడిని హత్య చేసిన నేరంపై హిందూరాష్ట్ర సేన అనే ఉగ్రవాద సంస్థ కు చెందిన ఏడుగురు కార్యకర్తలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
పుణేలో ఒక యువకుడిని హత్య చేసిన నేరంపై హిందూరాష్ట్ర సేన అనే ఉగ్రవాద సంస్థ కు చెందిన ఏడుగురు కార్యకర్తలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పుణేలో ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్న యువకుడు సోమవారం సాయంకాల ప్రార్థనలు ముగించుకుని వస్తూండగా ఏడుగురు యువకులు అతడిని చుట్టుముట్టి పొడిచి చంపేశారు.
ఛత్రపతి శివాజీని అవమానిస్తూ ఫేస్ బుక్ , వాట్సప్ ల వంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న అంశంపై పుణె ప్రస్తుతం అట్టుడుకుతోంది. ఇప్పటికే దాదాపు 200 బస్సులు, ఇతర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే హత్య జరగడంతో సంచలనం రేగింది. పోలీసులు ఈ సంస్థ కార్యకర్తలతో పాటు, సంస్థ అధినేత ధనంజయ్ దేశాయ్ ను కూడా అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
హిందూ రాష్ట్ర సేన సంస్థపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఎన్నాయి. గత ఏడాది అభ్యంతర కరపత్రాలు పంచుతున్నందున సంస్థ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.