బెంగళూరులో హెలీ ట్యాక్సీలు ప్రారంభం

Helicopter Taxi Services Inaugurated in Bangalore - Sakshi

శివాజీ నగర : బెంగళూరులో ట్రాఫిక్‌ రద్దీ పెరిగిపోవడంతో పలు ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునేందుకు హెలీ ట్యాక్సీలు అందుబాబులోకి వచ్చాయి. దేశంలోనే మొట్టమొదటిగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం– ఎలక్ట్రానిక్‌ సిటీ మధ్య ఈ హెలికాప్టర్‌ ట్యాక్సీ సేవలను సోమవారం ప్రారంభించారు. ఉదయం 6.30 గంటలకు ఎలక్ట్రానిక్‌ సిటీ నుంచి ఐదుగురు ప్రయాణికులతో హెలికాప్టర్‌ బయలుదేరింది.

కేరళలోని కొచ్చికి చెందిన తంబి ఏవియేషన్‌ సంస్థ ప్రవేశపెట్టిన ఈ హెలీ ట్యాక్సీలతో రోజుకు మూడు ట్రిప్‌లు వేయనున్నారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్‌ సిటీకి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ట్రాఫిక్‌లో 1 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అయితే హెలికాప్టర్‌లో 15 నిమిషాల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఒక్కొక్కరికి అన్ని పన్నులు కలిపి టిక్కెట్‌ ధరను రూ.4 వేలుగా నిర్ణయించారు.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top