గుజరాత్‌ సీఎంను సాగనంపారు: హార్థిక్‌ పటేల్‌

Hardhik Patel Says Vijay Rupani Was Asked To Resign  - Sakshi

అహ్మదాబాద్‌ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌పై బీజేపీ దృష్టి సారించిందని, సీఎం విజయ్‌ రూపానీని తప్పించారని పటేల్‌ ఉద్యమ నేత హార్థిక్‌ పటేల్‌ పేర్కొన్నారు. గతంలో ఆనందిబెన్‌ పటేల్‌ను రాజీనామా చేయాలని కోరిన తరహాలోనే గురువారం కేబినెట్‌ బేటీలో విజయ్‌ రూపానీని సీఎం పదవి నుంచి వైదొలగాలని కోరారని చెప్పారు.సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారని పది రోజుల్లో గవర్నర్‌ దాన్ని ఆమోదిస్తారని చెప్పారు. గుజరాత్‌ తదుపరి సీఎంగా క్షత్రియ లేదా పటేల్‌ వర్గీయుడిని ఎంపిక చేస్తారని తాను భావిస్తున్నానని హార్థిక్‌ పటేల్‌ పేర్కొన్నారు.

కాగా తాను రాజీనామా చేస్తున్నట్టు హార్థిక్‌ పటేల్‌ చేసిన వ్యాఖ్యలను సీఎం విజయ్‌ రూపానీ తోసిపుచ్చారు. మీడియా దృష్టిని ఆకర్షించిందుకే పటేల్‌ వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రులు రాజీనామా చేయరని, రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు సమర్పిస్తారని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు హార్థిక్‌ పటేల్‌ వంటి కాంగ్రెస్‌ ఏజెంట్లు ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top