కరోనా ఎఫెక్ట్‌ : వివాహాలు వాయిదా వేసుకోండి

Gyms And Night Clubs Ban In Delhi Says CM Kejriwal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక చర్యలను చేపట్టారు. మార్చి 31 వరకు ఢిల్లీలోని అన్ని జిమ్‌ సెంటర్లు, పబ్బులు, మసాజ్‌ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే దేశ రాజధానిలో నిరసనలకు వేదికగా నిలిచిన షాహిన్‌భాగ్‌లో సైతం ఆంక్షలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఎక్కడా కూడా 50 మందికిపైగా ప్రజలు గుమికూడి ఉండొద్దని తెలిపారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశాలు కేజ్రీవాల్‌ ప్రజలకు పలు సూచనలు చేశారు. వివాహాలు, వేడుకలు కూడా కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. (తొలి కరోనా బాధితుడి అనుభవాలు)

కాగా పాఠశాలలు, మాల్స్‌ను మూసివేయాలని గత వారమే ఆప్‌ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.  ఇప్పటి వరకు ఢిల్లీలో ఏడు కేసులు నమోదు కాగా..  కరోనా కారణంగా ఓ మహిళ మృతి చెందారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 110 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 33 కేసులు వెలగుచూశాయి.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top