సూపర్‌ బామ్మ వైరల్‌ వీడియో | Grandmother Typing Video | Sakshi
Sakshi News home page

సూపర్‌ బామ్మ వైరల్‌ వీడియో

Jun 7 2018 6:24 PM | Updated on Jun 7 2018 6:37 PM

Grandmother Typing Video - Sakshi

సాక్షి: రికార్డులను బ్రేక్‌ చేసిన బామ్మ వంటకాలను ఘుమఘుమలు ఆస్వాదించాం. అంతకుమించి  90సంవత్సరాల వయసులో యోగాసనాలతో ఇరగదీసిన వీడియోలను చూసి మురిసిపోయాం. తాజాగా మరో బామ్మ వీడియో నెట్‌లో చక్కర్లు కొడుతోంది. పాత తరం టైప్‌ మెషీన్‌పై తన వేళ్లను అలవోకగా, అతివేగంగా పరుగులు పెట్టిస్తూ.. ఆధునిక కంప్యూటర్‌లో డిలీట్‌, బ్యాక్‌ బటన్లతో కుస్తీలు పడుతూ టైపింగ్‌కోసం  అష్టకష్టాలుడుతున్న నేటి తరం టైపిస్టులకు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు సవాల్‌ విసురుతోందంటే అతిశయోక్తి కాదేమో. టైపింగ్‌ మిషన్‌మీద సునామీ వేగంతో టైప్‌ చేస్తున్న వైనం నెటిజనులను బాగాఆకట్టుకుటోంది. ఈ వీడియో ఎపుడు, ఎక్కడ తీసింది లాంటి ఇతర వివరాలు  ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కానీ రిజిస్ట్రార్‌ ఆఫీసులో నోటరీని టైప్‌ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముదిమి వయసులో కూడా తమకిష్టమైన క్రీడలు తదితర రంగాల్లో ప్రతిభను చాటుకున్న వారిని చాలామందినే చూశాం. కానీ ఈ టైపింగ్‌ బామ్మ మాత్రం నిజంగా సూపరే.. మరి మీరు కూడా  ఓ లుక్కేసుకోండి..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement