హోంమంత్రి అమిత్‌ షాతో గవర్నర్‌ భేటీ

Governor Narasimhan Meets Amit Shah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలను హోంమంత్రికి గవర్నర్‌ నివేదించారు. హోంమంత్రిగా అమిత్‌షా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి గవర్నర్‌ కలిశారు. భేటీ అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ... హోంమంత్రి అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని, స్నేహపూర్వకంగా ఉంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీకి చెందిన ఉపయోగంలో లేని భవనాలను తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేశామన్నారు. ఏపీ భవన్‌ సహా విభజన సమస్యలను ఒక‍్కొక‍్కటిగా పరిష్కరిస్తామని గవర్నర్‌ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top