వారు వైన్‌ తాగుతూ గోల్ఫ్‌ ఆడుతుంటారు..

Goa Governor Says Governors In The Country Do Not Have Much Work To Do - Sakshi

లక్నో : దేశంలో గవర్నర్లు చేసేందుకు పని ఏమీ ఉండదని గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అన్నారు. జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌ అయితే వైన్‌ తాగుతూ గోల్ఫ్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌గానూ వ్యవహరించిన మాలిక్‌ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన దేశంలో గవర్నర్లకు పనీపాటా ఏమీ ఉండదు. జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌ అయితే సాధారణంగా వైన్‌ తాగుతూ గోల్ఫ్‌ ఆడుతూ సేదతీరుతుంటారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లు మాత్రం వివాదాలకు దూరంగా ఉంటార’ని అన్నారు. యూపీలోని భాగ్పట్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చదవండి: అక్కడ కుక్కలు, గుర్రాల పేరుతో భూములు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top