కరణ్‌ థాపర్‌కు జీకే రెడ్డి పురస్కారం | G.K. Reddy award for journalist Karan Thapar | Sakshi
Sakshi News home page

కరణ్‌ థాపర్‌కు జీకే రెడ్డి పురస్కారం

Mar 24 2018 2:39 AM | Updated on Mar 24 2018 2:39 AM

G.K. Reddy award for journalist Karan Thapar - Sakshi

మన్మోహన్‌ నుంచి అవార్డును అందుకుంటున్న కరణ్‌ థాపర్‌. చిత్రంలో సుబ్బరామిరెడ్డి, ఆనంద్‌శర్మ తదితరులు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పాత్రికేయరంగంలో ఎనలేని కృషిచేసిన ప్రముఖ జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత కరణ్‌ థాపర్‌ను జీకే రెడ్డి స్మారక అవార్డు వరించింది. రాజ్యసభ సభ్యుడు, జీకే రెడ్డి స్మారక అవార్డు వ్యవస్థాపకుడు టి.సుబ్బరామిరెడ్డి, టీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ చేతుల మీదుగా థాపర్‌ ఈ అవార్డును అందుకున్నారు. సుబ్బరామిరెడ్డి, అవార్డు కమిటీ చైర్మన్, మాజీ కేంద్రమంత్రి కరణ్‌ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డుతోపాటు ప్రశంసా పత్రం, రూ.5లక్షల నగదు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement