గుజరాత్‌ను వీడి వెళ్లే ముందు నరేంద్ర మోడీ బాలికలకు చిరు కానుక అందించారు.
గుజరాత్‌ను వీడి వెళ్లే ముందు నరేంద్ర మోడీ బాలికలకు చిరు కానుక అందించారు. రాష్ట్రంలో బాలికా విద్యను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, ప్యూన్‌ల కుమార్తెల చదువులకు కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసేందుకు తాను పొదుపు చేసుకున్న డబ్బులోంచి రూ. 21 లక్షలను విరాళంగా అందించారు. ఈ విషయాన్ని మోడీ స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు.
ఈ ఫండ్‌కు జమఅయ్యే నిధుల పర్యవేక్షణకు సీఎం ఆనందీబెన్ పటేల్, ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ ఫౌండేషన్ ఏర్పాటు కానుంది. గతంలో బాలికల విద్య కోసం ప్రారంభించిన ‘కన్యా కేలవని అభియాన్’కు నిధుల కోసం మోడీ సీఎంగా తనకు లభించిన బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ. 89.96 కోట్లను ‘కన్యా కేలవాని నిధి’కి విరాళంగా ఇచ్చారు