సినిమా హాల్లో గ్యాంగ్‌రేప్‌ | Girl gangraped inside movie theatre | Sakshi
Sakshi News home page

సినిమా హాల్లో గ్యాంగ్‌రేప్‌

Dec 6 2017 4:16 PM | Updated on Aug 9 2018 7:30 PM

Girl gangraped inside movie theatre - Sakshi

సాక్షి, లక్నో :  మొబైల్‌ ఫోన్‌లో యువతితో స్నేహం.. అపై వంచన.. అదును చూసి ఆమెపై  అకృత్యాలు సహజంగా మారాయి. సినిమా స్టోరీలను తలపించే ఇటువంటి ఘటన తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. పదహారేళ్ల యువతితో ఇద్దరు వ్యక్తులు సెల్‌ఫోన్‌లో స్నేహం చేశారు. దాదాపు రెండు నెలల పాటు మొబైల్‌లో అందరూ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపారు.

స్నేహం పేరుతో మాట్లాడుకుంటూ.. అప్పుడప్పుడూ యువతిని దుం‍డగులు కలిసేవారు. ఈ నేపథ్యంలో యువతితో మంగళవారం దుండగులు కలిశారు. మవానా పట్టణంలో షాపింగ్‌ తరువాత సినిమాకు వెళ్లాలని అందరూ నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే సినిమాకు వెళ్లిన తరువాత.. ఎవరూలేని ప్రదేశంలో ముగ్గురు కూర్చుకున్నారు. సినిమా ప్రారంభమైన తరువాత.. ఇద్దరు యువకులు.. యువతిపై
పాశవికంగా, రాక్షసంగా అత్యాచారం చేశారు.

యువతి అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టి.. చేతులు కట్టేసి మరీ రాక్షసంగా అత్యాచారం జరిపారు. అత్యాచారం చేసిన తరువాత యువతిని ముజఫర్‌నగర్‌ ప్రాంతంలో వదిలిపెట్టారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట​ చేశారు. అలాగే యువకులు ఉయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement