కాల్పుల్లో కాంగ్రెస్‌ నేత మృతి | Ghulam Nabi Patel Encounter In Kashmir | Sakshi
Sakshi News home page

కాల్పుల్లో కాంగ్రెస్‌ నేత మృతి

Apr 25 2018 5:02 PM | Updated on Mar 18 2019 7:55 PM

Ghulam Nabi Patel Encounter In Kashmir - Sakshi

శ్రీనగర్‌:  కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఎప్పుడూ సామాన్య ప్రజలపై విరుచుకుపడే ఉగ్రవాదులు ఈ సారి రాజకీయ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని  కాల్పులకు దిగారు. దక్షిణ కశ్మీర్‌లోని రాజ్‌పూర్‌లో బుధవారం జరిగిన కాల్పుల్లో రాష్ట్ర కాంగ్రెస్‌  నేత గులాం నబీ పటేల్‌ మృతి చెందారు. మిలిటెంట్‌లు జరిపిన కాల్పుల్లో పటేల్‌ మృతి చెందగా, అతని వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తీ తీవ్రంగా ఖండించారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు సీఎం ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement