మోడీతో జర్మనీ మంత్రి భేటీ | German foreign minister meets Narendra Modi | Sakshi
Sakshi News home page

మోడీతో జర్మనీ మంత్రి భేటీ

Sep 8 2014 3:24 PM | Updated on Aug 15 2018 2:20 PM

జర్మనీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మీయెర్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: జర్మనీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మీయెర్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. భారత పర్యటనకు వచ్చిన ఫ్రాంక్ వాల్టర్ సోమవారమిక్కడ మోడీతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిశారు.

వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక, పునరుత్పాదక శక్తి రంగాల్లో పరస్పర సహకారం గురించి చర్చించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఆయన వెంట ఉన్నత స్థాయి వ్యాపారవేత్తల బృందం కూడా వచ్చింది. జర్మనీ మంత్రి మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి స్మృతి ఇరానీ, పట్టాణిభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్లతో కూడా సమావేశంకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement