గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసు రేపటికి వాయిదా | gali janardhan reddy bail case postpone tomorrow | Sakshi
Sakshi News home page

గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసు రేపటికి వాయిదా

Dec 15 2014 12:02 PM | Updated on Sep 2 2018 5:20 PM

మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసుపై తీర్పును సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

ఢిల్లీ:మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసుపై తీర్పును సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. జనార్ధన్ రెడ్డి బెయిల్ కు సంబంధించి సీబీఐ కొన్నిషరతులను సుప్రీంకు అందజేసింది. గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారికి వెళ్లకూడదని ఆ షరతుల్లో పేర్కొంది.

 

దీంతోపాటు కోర్టు విచారణకు సహకరించాలని, పాస్ పోర్టను అప్పగించాలని కూడా సీబీఐ తెలిపింది.  సీబీఐ పేర్కొన్న షరతులను ఆఫిడవిట్ రూపంలో ఇవ్వాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement