శారద స్కాం కేసులో పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ అరెస్ట్ | Former top Bengal policeman arrested in Saradha scam | Sakshi
Sakshi News home page

శారద స్కాం కేసులో పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ అరెస్ట్

Sep 9 2014 6:21 PM | Updated on Aug 20 2018 4:27 PM

శారద చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సీబీఐ పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ రజత్ మజుందర్ను అరెస్ట్ చేసింది.

న్యూఢిల్లీ: శారద చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సీబీఐ పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ రజత్ మజుందర్ను అరెస్ట్ చేసింది. డీజీపీగా పదవీవిరమణ చేసిన అనంతరం మజుందర్ శారద చిట్ ఫండ్ కంపెనీకి భద్రత సలహాదారుగా పనిచేశారు. కోట్లాది రూపాయిల కుంభకోణం కేసులో ఆయనపై మోసం, కుట్రపూరిత కేసులు నమోదయ్యాయి. గత నెలలో మజుందర్ను రెండు సార్లు విచారించిన సీబీఐ అధికారులు పలు పత్రాలు సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement