ఫ్లిప్ కార్ట్ సీఈవో ఇంటి ఖరీదు 32 కోట్లు! | Flipkart’s CEO buys Rs 32 cr home in B’luru | Sakshi
Sakshi News home page

ఫ్లిప్ కార్ట్ సీఈవో ఇంటి ఖరీదు 32 కోట్లు!

Jun 23 2016 8:30 PM | Updated on Aug 1 2018 3:40 PM

ఫ్లిప్ కార్ట్ సీఈవో ఇంటి ఖరీదు 32 కోట్లు! - Sakshi

ఫ్లిప్ కార్ట్ సీఈవో ఇంటి ఖరీదు 32 కోట్లు!

బెంగళూరు నగరంలో ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ ఇటీవల అతిపెద్ద నివాస గృహాన్ని 32 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

బెంగళూరు నగరంలో ఇటీవల అతిపెద్ద నివాస ఒప్పందం జరిగింది. పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ గృహాన్ని  32 కోట్ల రూపాయలతో కొనేందుకు ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ ముందుకొచ్చారు. నగరంలోని ఫ్లిప్ కార్ట్ కార్యాలయానికి అతి దగ్గరలో ఉన్న ఆ ఇంటిని కొనేందుకు ఆయన భారీగా రుణం తీసుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి.

ఐటీ కంపెనీలకు నెలవు, ఇండియాలోనే సుందర నగరంగా పేరొందిన బెంగళూరులో నివాస గృహాలకూ భారీ డిమాండ్ పెరిగిపోయినట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. నగరంలో ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ ఇటీవల అతిపెద్ద నివాస గృహాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 10,000 అడుగుల విస్తీర్ణంలో ఉన్న నివాస గృహాన్ని బిన్నీ బన్సాల్ సుమారు 32 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఆ నివాసం స్థానిక ఫ్లిప్ కార్ట్ కార్యాలయానికి అతి సమీపంలోనే ఉన్నట్లు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.

నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్, రాజీవ్ చంద్రశేఖర్ నివాసాలు బిన్నీ ఇంటికి పొరుగున ఉన్నాయని, బిన్నీ ఆ ఇంటిని కొనేందుకు భారీగానే రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement