ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌!

Flipcart Introducing Voice Assistant In its Android App  - Sakshi

ఈ- కామర్స్‌ దిగ్గజం ఫిప్‌కార్ట్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో తమ కస్టమర్లకు చేరువగానే ఉంటోంది.  వినియోగదారుల సేవలను మరింత సులభతరం చేసేందుకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో వాయిస్‌ అసిస్టెంట్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఈ వాయిస్‌ అసిస్టెంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ గ్రాసరీ స్టోర్‌లో, సూపర్‌ మార్ట్‌లో ఉపయోగించవచ్చు. హిందీ, ఇంగ్లీష్‌లో  ఇచ్చే వాయిస్‌ కమాండ్స్‌ను ఇది అర్థం చేసుకోగలదు. తద్వారా షాపింగ్‌ చేయడంలో ఇది కస్టమర్లకు  ఉపయోగపడుతుంది. ఫ్లిప్‌కార్ట్ గత సంవత్సరం ఫ్లిప్‌కార్ట్ సాతి పేరుతో స్మార్ట్ అసిస్టివ్‌ ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 

ఫ్లిప్‌కార్ట్ అంతర్గత సాంకేతిక బృందం స్పీచ్ రికగ్నిషన్, నేచురల్ లాంగ్వేజ్ అవగాహన, మెషిన్ ట్రాన్స్‌లేషన్, టెక్స్ట్ టు స్పీచ్ లాంటివి ఉపయోగించి ఈ  వాయిస్ అసిస్టెంట్‌ను అభివృద్ధి చేశారని సదరు సంస్థ తెలిపింది. ఇది వినియోగదారులు మాట్లాడే భాషను స్వయంగా గుర్తించగలదని, షాపింగ్‌కు సంబంధించిన సంభాషణను అర్థం చేసుకొని వినియోగదారులకు సహకారం అందిస్తుందని కూడా తెలిపింది. దీనిపై కస్టమర్ల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వివిధ పట్టణాలు, నగరాలలో ఐదు నెలలకు పైగా పరిశోధన చేసినట్లు కూడా ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.  (ఆహార రిటైల్లో ఫ్లిప్కార్ట్కు నో ఎంట్రీ!)

ఫ్లిప్‌కార్ట్ వాయిస్ అసిస్టెంట్ కేవలం ఇంగ్లీష్, హిందీలోని ఆదేశాలను మాత్రమే కాకుండా  ఈ రెండింటి మిశ్రమ భాషా ఆదేశాలకు కూడా ప్రతి స్పందించగలదు. ఈ అనుభవం షాపింగ్‌చేసినప్పుడు దుకాణదారుడితో మాట్లాడినట్లుగానే అనిపిస్తోంది అని ఫ్లిప్‌కార్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ వాయిస్‌ అసిస్టెంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీ అండ్రాయిడ్‌ ఆధారిత యాప్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకురానుంది. ఐఓఎస్‌ ఆధారిత యాప్‌లో, వెబ్‌లో భవిష్యత్తులో ఇది అందుబాటులోకి రానుంది. (ఫ్లిప్కార్ట్కు భారీ ఎదురుదెబ్బ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top