ఫ్లిప్‌కార్ట్‌కు భారీ ఎదురుదెబ్బ

DPIIT rejects Flipkartplan to enter food retail sector - Sakshi

 ఫుడ్ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశానికి ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్రం నో

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ  ఫ్లిప్‌కార్ట్‌కు భారీ షాక్‌ తగిలింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో  అమెజాన్ ఇండియాతో పోటీ పడుతూ  ఆహార సంబంధిత వ్యాపార ప్రణాళికలకు ఫ్లిప్‌కార్ట్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.  ఫుడ్ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించాలన్న ఫ్లిప్‌కార్ట్ ప్రతిపాదనను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ప్రతిపాదిత ప్రణాళిక నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన నియంత్రణ సంస్థ డిపార్ట్‌మెంట్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటి)  తెలిపింది.  

మరోవైపు ఈ పరిణామంపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి రజనీష్ కుమార్  ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని, తిరిగి దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ,  ఇన్నోవేషన్‌ ఆధారంగా నడిచే మార్కెట్  దేశ  రైతులు భారీ ప్రయోజనాన్ని సమకూరుస్తుందన్నారు.సప్లయ్‌ చెయిన్‌ సామర్థ్యం పెంపు, పారదర్శకతతో దేశ రైతులకు,ఆహార ప్రాసెసింగ్ రంగానికి గణనీయమైన విలువను చేకూరుస్తుందని నమ్ముతున్నామన్నారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు, వ్యవసాయంలో కీలక మార్పులకు దోహపడుతుందన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెజాన్ 2017లో భారతదేశంలో ఆహార ఉత్పత్తుల రిటైల్‌ వ్యాపారం కోసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది.

కాగా దేశం పెరుగుతున్న ఆహార రిటైల్ మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రణాళికను గత ఏడాది అక్టోబర్‌లో  ప్రకటించిన, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి ఈ కొత్త వెంచర్‌లో 258 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ కాలంలో కిరాణా విభాగం గణనీయమైన వృద్ధిని సాధించింది.  కఠిన ఆంక్షలతో ఇంటికే పరిమితమైన చాలామంది వినియోగదారులు ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై మొగ్గు చూపారు.  దీంతో గ్రోఫర్స్, బిగ్‌బాస్కెట్ అమెజాన్‌ లాంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు డిమాండ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. రాబోయే నెలల్లో  కూడా ఇది కొనసాగుతుందని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆహార రిటైల్ రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తుండటం గమనార్హం.

చదవండి : అతిపెద్ద మొబైల్‌ మేకర్‌గా భారత్‌: కొత్త పథకాలు
షావోమి ల్యాప్‌టాప్‌ లాంచ్‌ : ఈ నెలలోనే​

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

06-07-2020
Jul 06, 2020, 16:58 IST
ప్రతి ఆదివారం కర్ఫ్యూ మాత్రం ఉంటుందన్నారు
06-07-2020
Jul 06, 2020, 16:39 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో కరోనా పరీక్షల సామర్థ్యం భారీగా పెరిగింది. ఇప్పటి వరకు దేశంలో కోటి కరోనా నిర్ధారణ...
06-07-2020
Jul 06, 2020, 16:18 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో 1,263 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల...
06-07-2020
Jul 06, 2020, 16:10 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఓ జర్నలిస్ట్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రికలో విధులు...
06-07-2020
Jul 06, 2020, 15:26 IST
ముంబై: క‌రోనా భూతంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహన క‌ల్పించేందుకు పోలీసులు వారి శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆధార‌ప‌డే...
06-07-2020
Jul 06, 2020, 14:33 IST
మీరట్‌ : ‘క‌రోనా ప‌రీక్ష చేయించుకుంటే పాజిటివ్ వ‌స్తుందా నెగిటివ్ వ‌స్తుందా అని భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు.. క‌రోనా ఉన్న‌ప్ప‌టికీ దాన్ని లేకుండా చేయ‌గ‌లం.....
06-07-2020
Jul 06, 2020, 14:01 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ల సంఖ్య లక్ష దాటినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సోమవారం...
06-07-2020
Jul 06, 2020, 12:49 IST
నెల్లూరు(బారకాసు): ఫొటో, వీడియో ఆల్బమ్‌.. ప్రతిఒక్కరి జీవితంలో వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మధురమైన జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటారు. పుట్టినప్పటి నుంచి...
06-07-2020
Jul 06, 2020, 12:44 IST
పారిస్‌: మహమ్మారి కరోనా బారినపడి కోలుకుంటున్నవారికి ఓ చేదు వార్త. వైరస్‌ను జయించినవారిలో కొందరు అతిముఖ్యమైన వాసన గ్రహించే సామర్థ్యాన్ని...
06-07-2020
Jul 06, 2020, 12:43 IST
ప్రకాశం, సింగరాయకొండ: కరోనా...అయినవారందరూ ఉన్నా దిక్కులేని వారిని చేస్తోంది. కుటుంబంలో అందరికీ కరోనా సోకి ఆస్పత్రికి వెళ్తే.. ఓ వృద్ధురాలు...
06-07-2020
Jul 06, 2020, 11:55 IST
సిడ్నీ: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభిస్తున్న వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తిని కట్టడి...
06-07-2020
Jul 06, 2020, 10:52 IST
కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్‌లో  అత్య‌ధికంగా ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో 895 కొత్త క‌రోనా కేసులు న‌మోదుకాగా 21 మంది...
06-07-2020
Jul 06, 2020, 10:46 IST
సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా మహమ్మారితో విద్యా వ్యవస్థ అతలాకుతులమైంది.   2020–21 విద్యా సంవత్సరంపై కరోనా ప్రభావం పడింది. వైరస్‌...
06-07-2020
Jul 06, 2020, 10:14 IST
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ న‌టుడు నిక్ కార్డెరో క‌రోనా కార‌ణంగా అసువులు బాశారు. వైర‌స్‌తో 90 రోజుల సుదీర్ఘ పోరాటం త‌ర్వాత ఆదివారం ఆయ‌న...
06-07-2020
Jul 06, 2020, 10:03 IST
కర్ణాటక,బనశంకరి: ఆదివారం కరోనా కర్ఫ్యూ సమయంలో భర్తకు భోజనం బాక్స్‌ను అందించడానికి ఓ పోలీసు భార్య ఆరుకిలోమీటర్లు నడిచివెళ్లిన ఘటన...
06-07-2020
Jul 06, 2020, 09:13 IST
పుణె: కంపెనీ పనిమీద ఢిల్లీ వెళ్లొచ్చిన ఓ ఉద్యోగి పై పుణెలోని ఓ కంపెనీ యజమాని అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి...
06-07-2020
Jul 06, 2020, 09:05 IST
రష్యాను వెన‌క్కునెట్టి ప్ర‌పంచంలో క‌రోనా ప్ర‌భావిత‌ జాబితాలో భార‌త్ మూడో స్థానానికి ఎగ‌బాకింది.
06-07-2020
Jul 06, 2020, 08:46 IST
ఈ విధానమే ఐటీ కంపెనీల భవిష్యత్‌ పని విధానంగా మారుతుందేమోనని నిపుణులు భావిస్తున్నారు.
06-07-2020
Jul 06, 2020, 08:31 IST
న్యూఢిల్లీ: ముందుగా అనుకున్న ప్రకారం ఈరోజు పునఃప్రారంభం అవుతుందనుకున్న తాజ్‌మహల్‌ సందర్శన వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సందర్శకుల తాకిడితో...
06-07-2020
Jul 06, 2020, 08:13 IST
హిమాయత్‌నగర్‌: సహజంగా కుక్కల నుంచి మనుషులకు మనుషుల నుంచి కుక్కలకు వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఈ తరుణంలో చాలా వరకు అనుమానాలు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top