దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనంలో శుక్రవారం ఉదయం చిన్నపాటి అగ్నిప్రమాదం సంభవించింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనంలో శుక్రవారం ఉదయం చిన్నపాటి అగ్నిప్రమాదం సంభవించింది. పార్లమెంటు భవనంలోని మూడో అంతస్థులో ఉదయం 8.40 గంటలకు మంటలు చెలరేగాయి. వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలను సంఘటన స్థలానికి హుటాహుటిన తరలించారు.
అక్కడి ఎయిర్ కండిషనర్ల నుంచే మంటటు వచ్చినట్లు అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే, మంటలు కొద్దిస్థాయిలోనే ఉండటంతో సరిగ్గా పది నిమిషాల్లో వాటిని ఆర్పేశారు.