ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం | fire accident at chemical factory in west bengal state | Sakshi
Sakshi News home page

ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Jan 5 2017 7:10 AM | Updated on Sep 13 2018 5:11 PM

ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం - Sakshi

ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరిగణాల జిల్లాలో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరిగణాల జిల్లాలో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. మధ్యంగ్రామ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం వేకువజామున ఈ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి 38 ఫైరింజన్లు చేరుకున్నాయి.కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా యత్నిస్తోంది. అయితే సహాయక చర్యల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తుండగా ముగ్గురు ఫైర్ సిబ్బందికి కాలిన గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement