సాక్షి, హైదరాబాద్: ప్రకృతి విలయంతో ఛిద్రమైన కేరళను కష్టాల కడలి నుంచి గట్టెక్కించే మానవతా కృషి జరగాలిప్పుడు. ఎవరిస్థాయిలో వారు ఆర్థిక సహాయం అందించడానికి మానవతా దృక్పథంతో ముందుకు రావాలని ‘సాక్షి మీడియా సంస్థ’ పిలుపునిస్తోంది. సాటి మనుషుల కష్టం మన కష్టంగా భావించి తోచిన సా యం అందించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తోంది. కేరళ ప్రభుత్వం కూడా సాయం చేయాలంటూ ట్విట్టర్ ద్వారా అభ్యర్థిస్తోంది. బాధితులకు సాయం చేయాలంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇలా విరాళాలను పంపించొచ్చు.
అకౌంట్ నంబర్: 67319948232
బ్యాంక్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
శాఖ: సిటీ బ్రాంచ్, తిరువనంతపురం
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: SBIN0070028
పాన్: AAAGD0584M
స్విఫ్ట్ కోడ్: SBININBBT08
సాయానికి ‘సాక్షి’ పిలుపు
Aug 22 2018 2:48 AM | Updated on Aug 22 2018 2:57 AM
Advertisement


