మంచి సినిమాలే తీస్తా | Farah Khan: I don't make tacky films | Sakshi
Sakshi News home page

మంచి సినిమాలే తీస్తా

Sep 19 2014 10:56 PM | Updated on Aug 9 2018 7:28 PM

మంచి సినిమాలే తీస్తా - Sakshi

మంచి సినిమాలే తీస్తా

ఆమె సినిమాలు నృత్యాలు, పాటలు, మెలోడ్రామా, శృంగారం, అనేక రకాల ఎమోషన్లు, రంగులు, స్టార్ పవర్ సమ్మిళితం. అందువల్ల ఏ సినిమా అయినా ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుంది.

దర్శకురాలు ఫరాఖాన్
న్యూఢిల్లీ: ఆమె సినిమాలు నృత్యాలు, పాటలు, మెలోడ్రామా, శృంగారం, అనేక రకాల ఎమోషన్లు, రంగులు, స్టార్ పవర్ సమ్మిళితం. అందువల్ల ఏ సినిమా అయినా ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుంది. అవి మాస్ నుంచి క్లాస్‌ను కూడా అలరిస్తుంది. సొంత గడ్డపైతోపాటు విదేశాల్లోనూ మంచిపేరు తెచ్చిపెడుతుంది. ఆ ప్రతిభాశాలి మరెవరో కాదు... ఫరాఖాన్. అసాధ్యాన్ని సుసాధ్యంచేయగలిగిన సత్తా ఉన్నప్పటికీ విజయానికి పొంగిపోయి, అపజయానికి కుంగిపోయే స్వభావం ఫరాఖాన్‌కు లేదు. సినిమా నిర్మాతగా మారకముందు కొరియోగ్రఫర్‌గా ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రేక్షకులు మైమరిచిపోయేవిధంగా నృత్యాన్ని సమకూర్చింది.

ఈ విషయమై ఫరాఖాన్ తన అనుభవాలను మీడియాతో పంచుకుంటూ తాను పనికిమాలిన సినిమాలను తీయనని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రాలనే తెరపెకైక్కిస్తానని అంది. ప్రేక్షకులకు ఏ సినిమా నచ్చుతుందనే విషయాన్ని అంత తేలిగ్గా ఎవరూ అంచనా వేయలేరంది. ముఖ్యంగా బీక్లాస్ ఆడియన్స్‌తోపాటు లండన్, అమెరికా దేశాలకు చెందిన ప్రేక్షకులను ను మెప్పించడం అంత సులువేమీ కాదంది.

కొంతమంది పెద్ద పెద్ద నటులతో కలిసి మంచి కళాతమకమైన సినిమాలే తీస్తానని, పనికిమాలిన సినిమాలు అసలు తీయనని‘తీస్ మార్ ఖాన్’ దర్శకురాలైన ఈ 49 ఏళ్ల ఈ కొరియోగ్రాఫర్ తెలిపింది. షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా ఇటీవల ‘హేపీ న్యూ ఇయర్’ సినిమా తీసింది. ఇందులో షారుఖ్‌ఖాన్ కథానాయకుడు కాగా ఇంకా దీపికా పదుకొణే, అభిషేక్ బచ్చన్, బొమన్ ఇరానీ, సోనూసూద్,  వివన్‌షా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement