'మేకిన్ ఇండియా లోగో చూసి ఆశ్చర్యపోయా' | Excise duty on jewellery an 'assassination attempt on jewellers', says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

'మేకిన్ ఇండియా లోగో చూసి ఆశ్చర్యపోయా'

Apr 6 2016 2:45 PM | Updated on Sep 3 2017 9:20 PM

'మేకిన్ ఇండియా లోగో చూసి ఆశ్చర్యపోయా'

'మేకిన్ ఇండియా లోగో చూసి ఆశ్చర్యపోయా'

'మేకిన్ ఇండియా'లోగోలో సింహం బొమ్మ పెట్టడంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానని రాహుల్ గాంధీ తెలిపారు.

న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలపై ఎక్సైజ్ డ్యూటీ విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం బంగారు వర్తకుల పాలిట ఆత్మహత్యాసదృశ్యంగా ఆయన వర్ణించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బంగారు వ్యాపారులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. బీజేపీలోని కొంత మంది నాయకులు బంగారు ఆభరణాలపై ఎక్సైజ్ డ్యూటీని వ్యతిరేకిస్తున్నారని, బహిరంగంగా చెప్పడానికి వారు జంకుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు.

'మేకిన్ ఇండియా'లోగోలో సింహం బొమ్మ పెట్టడంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లను మేలు చేసేందుకే 'మేకిన్ ఇండియా'ను ముందుకు తీసుకొచ్చారని తర్వాత తనకు అర్థమైందన్నారు. 'మేకిన్ ఇండియా'తో పేదలకు ఒరిగేదేం లేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement