కశ్మీర్‌లో ఎన్ కౌంటర్‌ | Encounter in Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఎన్ కౌంటర్‌

Feb 5 2017 1:17 AM | Updated on Aug 25 2018 6:08 PM

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలు శనివారం జరిపిన ఎన్ కౌంటర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలు శనివారం జరిపిన ఎన్ కౌంటర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోపోర్‌కు చెందిన అమర్‌గఢ్‌ గ్రామం సమీపంలో ఈ ఎన్ కౌంటర్‌ చోటు చేసుకుంది. ఓ వాహనంలో వెళుతున్న ఇద్దరు ఉగ్రవాదుల్ని పోలీసులు గమనించి చుట్టుముట్టారు.

ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు వారిపై ఓ గ్రెనేడ్‌ను విసరడమేగాక కాల్పులకు దిగారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదులు సోపోర్‌లో హింసాత్మక చర్యలకు పన్నాగం పన్నినట్టు సమాచారమందటంతో పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమై వారిని అడ్డుకున్నట్టు పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement