నిష్పక్షపాతంగా సోదాలు: ఈసీ

Election Commission Said Enforcement Agencies Must Act Neutrally - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఐటీ, ఈడీ లాంటి సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో వరుసగా ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఈ మేరకు తాజాగా లేఖ రాసింది. దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్య తీసుకునే ముందైనా తమకు తెలియజేయాలని కోరింది. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఐటీ శాఖ పలువురు రాజకీయ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

కేంద్రం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. ఎన్నికల వేళ అక్రమ నగదు చలామణి అవుతోందని అనుమానాలు వస్తే దాడులు చేసే ముందు సంబంధిత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలియజేయాలని ఈసీ సూచించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top