ఈడీ ముందుకు శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా | ED Summons Raj Kundra | Sakshi
Sakshi News home page

ఈడీ ముందుకు శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా

Oct 31 2019 4:41 AM | Updated on Oct 31 2019 4:41 AM

ED Summons Raj Kundra - Sakshi

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు హాజరయ్యారు. దివంగత గ్యాంగ్‌స్టర్‌ ఇక్బాల్‌ మిర్చికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ రాజ్‌కుంద్రాకు సమన్లు జారీ చేసింది. కుంద్రా ఉదయం 11 గంటలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి వచ్చారని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. కుంద్రాను నవంబర్‌ 4న హాజరు కావాలని దర్యాప్తు సంస్థ కోరగా, ఆ సమయంలో తాను అందుబాటులో ఉండలేని కారణంగా ముందస్తు తేదీని కోరినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి రంజీత్‌ బింద్రా, బాస్టియన్‌ హాస్పిటాలిటీ సంస్థలతో కుంద్రాకు గల సంబంధాలు, వడ్డీలేని రుణాలు అందించిన విషయంపై ఈడీ పరిశీలిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement