జమ్మూ కశ్మీర్‌లో ఈ ఏడాదే ఎన్నికలు 

EC Declares Jammu And Kashmir Assembly Elections To Be Conducted In 2019 - Sakshi

న్యూఢిల్లీ: కశ్మీర్‌ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర ముగిసిన తర్వాత ప్రకటిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం చెప్పింది. అమర్‌నాథ్‌ యాత్ర వచ్చే నెలలో ప్రారంభం కానుంది. అంటే ఈ ఏడాదిలోనే కశ్మీర్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు తాము ఏకగ్రీవంగా నిర్ణయించామని ఈసీ తెలిపింది. 2018 జూన్‌లో పీడీపీ–బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన అనంతరం ఆ రాష్ట్రంలో ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వ పాలనే లేదు. ఆ రాష్ట్రంలో 2018 జూన్‌ 19 నుంచి డిసెంబర్‌ 19 వరకు గవర్నర్‌ పాలన, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన నడుస్తోంది. జూన్‌ 19న రాష్ట్రపతి పాలన గడువు ముగుస్తుండగా, దాన్ని పొడిగించేందుకు అంతా సిద్ధం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top