‘లాక్‌డౌన్‌ : భారీ సడలింపులకు ఇది సమయం కాదు’

Ease Llockdown After Peak Or Increase Tests Says AIIMS Study - Sakshi

కేసుల వెల్లువే..

సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తే కరోనా వైరస్‌ కేసులు పెద్దసంఖ్యలో వెలుగుచూస్తాయని ఎయిమ్స్‌ నేతృత్వంలో చేపట్టిన అథ్యయనం హెచ్చరించింది. కోవిడ్‌-19 కేసులు ముమ్మర దశకు చేరిన మీదట విస్తృతంగా టెస్టులు నిర్వహించిన అనంతరమే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడం మేలని ఎయిమ్స్‌ వైద్యులు గిరిధర గోపాల్‌ పరమేశ్వరన్‌, మోహక్‌ గుప్తా, సప్తర్షి సోహన్‌ మహంత నేతృత్వంలో సాగిన అథ్యయనం పేర్కొంది.

లాక్‌డౌన్‌ ప్రయోజనాన్ని పూర్తిగా పొందేందుకు భారత్‌ మరికొంత కాలం వేచిచూడాలని సూచించింది. ఈలోగా భారత్‌ వైద్య మౌలిక వసతులు సమకూర్చుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. రోజువారీ కరోనా వైరస్‌ కేసుల్లో ఎలాంటి తగ్గుదల లేదని, ఇలాంటి పరిస్థితిలో లాక్‌డౌన్‌కు భారీ సడలింపుల వల్ల వైరస్‌ కేసులు గణనీయంగా పెరుగుతాయని అథ్యయనం వెల్లడించింది.

చదవండి : మరింత అప్రమత్తంగా ఉండాలి : మోదీ

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఒక్కసారిగా పూర్తిగా ఎత్తివేయడం సరైనది కాదని, దీంతో మహమ్మారి కేసులు పెరుగుతాయని నిర్ధిష్ట కాలం లాక్‌డౌన్‌ను పొడిగిస్తే చురుకైన కేసులు ముమ్మరమై క్రమంగా క్షీణ దశకు చేరుకునే క్రమంలో దశలవారీగా లాక్‌డౌన్‌ను ఉపసంహరించాలని అథ్యయనం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ను పొడిగిస్తే తాజా కేసుల (రెండో దశ)ను జాప్యం చేయవచ్చని దీంతో ప్రభుత్వం వైద్యారోగ్య మౌలిక వసతులను పెంచుకునేందుకు సమయం లభిస్తుందని పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top