డోక్లాం వివాదం పరిష్కారం వెనుక... | Doklam  got resolved because India is a world power: Rajnath  | Sakshi
Sakshi News home page

డోక్లాం వివాదం పరిష్కారం వెనుక...

Oct 8 2017 4:42 PM | Updated on Oct 8 2017 4:43 PM

Doklam  got resolved because India is a world power: Rajnath 

సాక్షి,న్యూఢిల్లీ: భారత్‌ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న క్రమంలోనే చైనాతో డోక్లాం వివాదాన్ని పరిష్కరించుకోగలిగిందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ చెప్పారు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ విపణిలో భారత్‌ ప్రతిష్ట ఇనుమడించిందని అన్నారు. డోక్లాం ప్రతిష్టంభన వీడేందుకు భారత్‌ పరిణితితో వ్యవహరించిందన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ ప్రతిష్ట పలుచనైతే డోక్లాం అంశం ఎన్నటికీ పరిష్కారమయ్యేది కాదని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.

సిక్కిం‌-భూటాన్‌-టిబెట్‌ ట్రైజంక్షన్‌ వద్ద డోక్లాం ప్రాంతానికి సమీపంలో చైనా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో ఇరు దేశాల మధ్య వివాదం నెలకొంది.  71 రోజుల పాటు ఇండో,చైనా దళాలు సరిహద్దుల్లో మోహరించాయి. డోక్లాం వ్యవహరం సద్దుమణిగిన నేపథ్యంలో ఇతర వివాదాలనూ శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్,చైనా సంసిద్ధత వ్యక్తం చేశాయి. కాగా, అభివృద్ధి దిశగా ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాలని భారత్‌లో చైనా రాయబారి పిలుపు ఇవ్వడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement