వైరల్‌: జమాతే సభ్యులపై డాక్టర్‌ అనుచిత వ్యాఖ్యలు

UP Doctor Hate Rant Against Islamic Section Members On Camera - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్‌ వైద్యురాలు తబ్లిగీ జమాతే సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్నవారిని టెర్రరిస్టులతో పోల్చారు. వారిని ఆస్పత్రులకు కాకుండా నేరుగా జైలుకు తరలించాలని లేదంటే.. అడవుల్లోకి పంపేయాలని అసహనం వ్యక్తం చేశారు. కాన్పూర్‌లోని గణేష్‌ శంకర్‌ విద్యార్థి మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఆర్తిలాల్‌ చందని చేసిన వివక్షాపూరిత వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెత్త ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల కిందటి ఈ వీడియో వైరల్‌ అయింది. 

ఇదిలాఉండగా.. ముస్లిం మత ప్రార్థనల్లో పాల్గొన్న వారికి గణేష్‌ శంకర్‌ విద్యార్థి మెడికల్‌ కాలేజీలో ఏప్రిల్‌లొ క్వారైంటన్‌ సౌకర్యం కల్పించారు. ఈక్రమంలో జమాతే సభ్యులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆస్పత్రిలో ఎక్కడపడితే అక్కడే ఉమ్మివేశారని అప్పట్లో కాలేజీ యాజమాన్యం ఆరోపించింది. భౌతికదూరం పాటించలేదని పేర్కొంది. కాగా, తాజాగా విడుదలైన 5 నిముషాల వీడియోపై ఆర్తి స్పందించారు.

తబ్లిగీ సోదరులపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తన వీడియోను మార్ఫింగ్‌ చేశారని చెప్పారు. తాను ఏ వర్గాన్ని కించపర్చలేదని పేర్కొన్నారు. ఇంకా ఆ వర్గం మంచి కోసం తాను ఎప్పుడూ పనిచేస్తామనని చెప్పుకొచ్చారు. కాగా, ఆర్తి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) నేత సుభాషిణి అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రపజాస్వామిక, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top