డిజిటల్‌ చెల్లింపులపై ‘టోల్‌ఫ్రీ’ | Digital compensation on 'toll free' | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ చెల్లింపులపై ‘టోల్‌ఫ్రీ’

Jan 5 2017 2:55 AM | Updated on Sep 28 2018 3:31 PM

డిజిటల్‌ చెల్లింపులపై ప్రజల సందేహాలు తీర్చడానికి, సమాచారం అందించడానికి కేంద్రం 14444 అనే టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెట్టింది.

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులపై ప్రజల సందేహాలు తీర్చడానికి, సమాచారం అందించడానికి కేంద్రం 14444 అనే టోల్‌ఫ్రీ  హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మధ్యే ప్రారంభించిన భీమ్‌ యాప్, ఈ వాలెట్లు, ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ, యూఎస్‌ఎస్‌డీలకు సంబంధించిన సందేహాలకు హెల్ప్‌లైన్‌ బదులిస్తుంది.

14444 హెల్ప్‌లైన్‌ ప్రస్తుతానికి హిందీ, ఆంగ్ల భాషల్లో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అందుబాటులో ఉండగా, త్వరలో దేశమంతా విస్తరిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement