జమ్మూలో డీజిల్, పెట్రోల్ కు తీవ్ర కొరత! | Diesel, Petrol scarcity in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూలో డీజిల్, పెట్రోల్ కు తీవ్ర కొరత!

Sep 11 2014 7:02 PM | Updated on Sep 2 2017 1:13 PM

జమ్మూకాశ్మీర్‌లో పెట్రోల్‌, డీజిల్‌, కిరోసిన్‌కు తీవ్ర కొరత ఏర్పడిందని సహాయక చర్యల్లో నిమగ్నమైన సైన్యాధికారిల బృందం

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో పెట్రోల్‌, డీజిల్‌, కిరోసిన్‌కు తీవ్ర కొరత ఏర్పడిందని సహాయక చర్యల్లో నిమగ్నమైన సైన్యాధికారిల బృందం తెలిపింది. వరదల కారణంగా రోడ్లు, రవాణ వ్యవస్థ దెబ్బతినడం ప్రత్యామ్నాయ రూట్లలో 350 ట్రక్కుల పెట్రోల్‌ పంపుడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. చమురు నిల్వలున్నా రోడ్లు పాడవడంతో వెళ్లలేకపోతున్నామని ఆర్మీ ఆధికారులు తెలిపారు. 
 
వరద సహాయ కార్యక్రమాల్లో 30వేల మంది జవాన్లు పాల్గొంటున్నారని, ఇప్పటి వరకు లక్షమందిని కాపాడిందని ఆర్మీ తెలిపింది. వరుసగా 10వ రోజూ కూడా అలుపెరగక ఆర్మీ శ్రమిస్తున్నారని, వైద్యసేవల్లో 80 బృందాలు, 21,500మందికి ఇప్పటివరకు చికిత్స చేశామన్నారు. 
 
హైదరాబాద్, వడోదర, అమృత్‌సర్‌, ఢిల్లీ నుంచి ఆహారపొట్లాలు, మంచినీటి బాటిల్స్‌ సరఫరా చేస్తున్నామన్నారు. శ్రీనగర్‌ రహదారి మరమ్మతుకు మరో వారంరోజుల సమయం పడుతుందని, పూర్తిస్థాయిలో పునరుద్ధరణకు మరో 10 రోజులు పడుతుందని సైన్యం తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement