దేశవ్యాప్తంగా ఈడీ అటాక్.. | Demonetisation: ED searches on 40 locations across country | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా ఈడీ అటాక్..

Nov 30 2016 5:00 PM | Updated on Sep 27 2018 5:09 PM

దేశవ్యాప్తంగా ఈడీ అటాక్.. - Sakshi

దేశవ్యాప్తంగా ఈడీ అటాక్..

పెద్ద నోట్ల రద్దుతో తమ దగ్గరున్న పాత రూ.500, రూ.1000 నోట్లను పెద్ద మొత్తంలో మార్చుకోవాలని చూస్తున్న నల్లబాబులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది.

న్యూ ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో తమ దగ్గరున్న పాత రూ.500, రూ.1000 నోట్లను పెద్ద మొత్తంలో మార్చుకోవాలని చూస్తున్న నల్లబాబులపై ఎన్ఫోర్స్మెంట్  డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. ఏకకాలంలో దేశ వ్యాప్తంగా 40 ప్రదేశాల్లో బుధవారం ఈడీ సొదాలు నిర్వహించింది. అక్రమ పద్ధతుల్లో పెద్ద మొత్తంలో పాత నోట్లను మారుస్తున్నవారు, హవాలా డీలర్లు, నల్లధనం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై నిఘా పెట్టిన ఈడీ, ఏకకాలంలో దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది.

వివిధ విభాగాలకు చెందిన అధికారులతో పాటూ పోలీసులు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారని ఉన్నతాధికారులు తెలిపారు. కోల్కతాలో జరిపిన తనిఖీల్లో ఓ డాక్టర్ దగ్గర రూ. 10 లక్షల కొత్త నోట్లను, మరో వ్యక్తి దగ్గర నుంచి రూ.నాలుగు లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement