breaking news
Hawala dealers
-
దేశవ్యాప్తంగా ఈడీ అటాక్..
న్యూ ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో తమ దగ్గరున్న పాత రూ.500, రూ.1000 నోట్లను పెద్ద మొత్తంలో మార్చుకోవాలని చూస్తున్న నల్లబాబులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. ఏకకాలంలో దేశ వ్యాప్తంగా 40 ప్రదేశాల్లో బుధవారం ఈడీ సొదాలు నిర్వహించింది. అక్రమ పద్ధతుల్లో పెద్ద మొత్తంలో పాత నోట్లను మారుస్తున్నవారు, హవాలా డీలర్లు, నల్లధనం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై నిఘా పెట్టిన ఈడీ, ఏకకాలంలో దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది. వివిధ విభాగాలకు చెందిన అధికారులతో పాటూ పోలీసులు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారని ఉన్నతాధికారులు తెలిపారు. కోల్‌కతాలో జరిపిన తనిఖీల్లో ఓ డాక్టర్ దగ్గర రూ. 10 లక్షల కొత్త నోట్లను, మరో వ్యక్తి దగ్గర నుంచి రూ.నాలుగు లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది. -
కోల్‌కతాలో రూ.45 కోట్లు హవాలా డబ్బు పట్టివేత
కోల్‌కతా/న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ గురువారం కోల్‌కతా, పరిసర ప్రాంతాల్లో హవాలా డీలర్లపై జరిపిన దాడుల్లో 45 కోట్ల రూపాయల నల్లధనం దొరికింది. అక్రమపద్ధతుల్లో ఆర్జించిన ఈ నల్లధనాన్ని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు పంపుతున్నట్లుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. నిఘా విభాగం నుంచి అందిన సమాచారం మేరకు... కోల్‌కతా ఐటీ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో అలీపూర్ పోలీసుస్టేషన్ పరిధి లో నాలుగు చోట్ల, శరత్‌బోస్ రోడ్డులో ఒక ఆఫీసుపై దాడి చేశారు. 16 గోనెసంచుల్లో, 27 ట్రావెల్ బ్యాగుల్లో, 2 అల్మారాల్లో కుక్కిన దాదాపు 45 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. జి సిస్టమ్స్, ఎఫ్.పి.ఎంటర్ప్రైజెస్ సంస్థలకు చెందిన డబ్బుగా గుర్తించారు. ఎస్.నాగార్జున, సాంటియాగో మార్టిన్లను ఈ హవాలా రాకెట్‌కు మూలకారకులుగా గుర్తిం చారు. పలు రాష్ట్రాల్లో విస్తరించిన నకిలీ లాటరీ రాకెట్‌ను ఈ ముఠా నడుపుతున్నట్లు అనుమానిస్తున్నారు. గుట్టలుగా దొరికిన డబ్బును లెక్కించేందుకు 12 కౌంటింగ్ మిషన్లు వాడారు. 45 కోట్లు ఉంటుందని చెబుతున్నా.. ఈ మొత్తం 50-55 కోట్లు ఉండొచ్చని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.