కరోనా పాజిటివ్‌.. జర్నలిస్ట్‌ ఆత్మహత్య | Delhi Journalist Suicide In AIIMS Due To Corona Positive | Sakshi
Sakshi News home page

కరోనా పాజిటివ్‌.. జర్నలిస్ట్‌ ఆత్మహత్య

Jul 6 2020 4:10 PM | Updated on Jul 6 2020 7:59 PM

Delhi Journalist Attempt Suicide In AIIMS Due To Corona Positive - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఓ జర్నలిస్ట్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రికలో విధులు నిర్వర్తిస్తున్న తరుణ్‌ సిసోడియాకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనకు ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్కడున్న సిబ్బంది వెంటనే గమనించి ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందారు. తరుణ్‌ సమీప వ్యక్తుల సమాచారం ప్రకారం.. వైరస్‌ బారినపడటంతో ఉద్యోగం కోల్పోయినట్లు తెలుస్తోంది. (చైనా ఆస్పత్రి కన్నా పదింతలు పెద్దది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement