గడువులోగా చదువు పూర్తిచేయాల్సిందే | degree complete below the deadline | Sakshi
Sakshi News home page

గడువులోగా చదువు పూర్తిచేయాల్సిందే

Mar 6 2017 2:53 AM | Updated on Sep 5 2017 5:17 AM

డిగ్రీని గడువులోగా పూర్తిచేయలేని అభ్యర్థులకు వరంలా ఉన్న ‘ప్రత్యేక నిబంధన’ను రద్దు చేస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: డిగ్రీని గడువులోగా పూర్తిచేయలేని అభ్యర్థులకు వరంలా ఉన్న ‘ప్రత్యేక నిబంధన’ను రద్దు చేస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. అనారోగ్యం, వివాహం ఇతర కారణాలతో  హాజరు కాలేని విద్యార్థులకు ప్రత్యేకంగా సమయం ఇస్తున్నట్లు వర్సిటీ పాలక మండలి(ఈసీ) సభ్యులు తెలిపారు.

విశ్వవిద్యాలయం నియమనిబంధనల ప్రకారం కళాశాలలో చేరిన నాటి నుంచి డిగ్రీ విద్యార్థులు ఆరేళ్ల్లలో, పీజీ విద్యార్థులు నాలుగేళ్లలో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక వేళ పూర్తి చేయలేకపోతే విశ్వవిద్యాలయం ఆ పట్టాలను పరిగణనలోకి తీసుకోదు. ప్రత్యేక నిబంధన ప్రకారం గైర్హాజరుకు సరైన కారణం చూపితే చదువు పూర్తిచేయడానికి ఎటువంటి కాల పరిమితి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement