కూతురి పెళ్లి బాధ్యతను అప్పుగా చూపిన అభ్యర్థి | Daughter's marriage debt is shown in the candidate | Sakshi
Sakshi News home page

కూతురి పెళ్లి బాధ్యతను అప్పుగా చూపిన అభ్యర్థి

Nov 12 2014 2:18 AM | Updated on Mar 18 2019 9:02 PM

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్‌

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్‌లో తన అవివాహిత కుమార్తె పెళ్లి బాధ్యతను అప్పుల జాబితాలో చూపారు! గాందెర్‌బాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మహమ్మద్ యూసఫ్ భట్ ఈ నిర్వాకం వెలగబెట్టాడు. దీనిపై విమర్శలు రావడంతో స్పందించారు. ‘నా కుమారులు సంపాదిస్తున్నారు కానీ, ఆమె సంపాదించడం లేదు. కుమార్తె పెళ్లి తండ్రి బాధ్యత.

నా కూతురి పెళ్లికి బ్యాంకులో జమచేసిన డబ్బు గురించి అఫిడవిట్‌లో తెలిపాను’ అ చెప్పారు. తనకు సరిగ్గా చదువు రాకపోవడంతో బాధ్యతకు, అప్పుకు మధ్య తేడాను అర్థం చేసుకోలేకపోయానన్నారు. తనకు రూ.11 లక్షల చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్సీ సీటు కోసం దివంగత నేషనల్ కాన్ఫరెన్స్ నేత హాజీ యూసఫ్‌కు రూ. 84 లక్షలు ఇచ్చానని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement