మా నాన్న ఉత్సాహం ఆధారంగా 'జీవితచరిత్ర' | Daman Singh book 'Strictly Personal' | Sakshi
Sakshi News home page

మా నాన్న ఉత్సాహం ఆధారంగా 'జీవితచరిత్ర'

Sep 16 2014 3:29 PM | Updated on Sep 2 2017 1:28 PM

దామన్‌ సింగ్

దామన్‌ సింగ్

తన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలా? లేదా అన్న దానిపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించుకోవాల్సి ఉందని ఆయన కుమార్తె దామన్‌సింగ్ తెలిపారు.

న్యూఢిల్లీ: తన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలా? లేదా అన్న దానిపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించుకోవాల్సి ఉందని ఆయన కుమార్తె దామన్‌సింగ్ తెలిపారు. ‘‘నా తండ్రి తన జీవిత చరిత్రను ఎప్పుడు రాస్తారనేది, ఆయన దానిపై కనపరిచే ఉత్సాహంపైనే ఆధారపడి ఉంది’’ అని దామన్ చెప్పారు. తన తల్లిదండ్రుల వ్యక్తిగత జీవిత విశేషాలతో ‘స్ట్రిక్ట్‌లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’ అనే పుస్తకాన్ని దామన్‌సింగ్ రచించిన విషయం తెలిసిందే.

ఈ పుస్తకం ప్రచురణ  సందర్భంగా దామన్‌సింగ్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల గురించి అభిమానంతో, నిజాయతీగా రాయడానికి ముగ్గురు రచయితల (విక్రంసేత్, సిలివా నాసర్, ఎంజే అక్బర్) జీవిత చరిత్రలు సహాయపడినట్లు  ఆమె వెల్లడించారు.
**

Advertisement
 
Advertisement
Advertisement