జమ్మూ ఆందోళన హింసాత్మకం

Curfew in Jammu after violent protests over Pulwama attack - Sakshi

గుజ్జర్‌నగర్‌లో వాహనాలకు నిప్పు  

శ్రీనగర్‌ / జమ్మూ / న్యూఢిల్లీ: దాడి నేపథ్యంలో ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జమ్మూలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా పలుచోట్ల రెచ్చిపోయిన ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో తొలుత జమ్మూ పట్టణంలో కర్ఫ్యూ విధించిన జమ్మూ అధికారులు, చివరకు ఆర్మీ సాయాన్ని అర్థించారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించింది. జమ్మూలోని గుజ్జర్‌నగర్‌ ప్రాంతంలో ఆందోళనకారులు ఆస్తుల విధ్వంసానికి దిగారు. పలు వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు కార్లను ధ్వంసం చేశారు. మరోవైపు జమ్మూ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌(జేసీసీఐ) గురువారం పిలుపునిచ్చిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై పూర్తిస్థాయి కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ(సీవోఐ)కి సీఆర్పీఎఫ్‌ ఆదేశించింది. ఈ విషయమై సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ..  దాడిలో చనిపోయినవారంతా సీఆర్పీఎఫ్‌ రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీ(ఆర్వోపీ)కి చెందినవారనీ, కాన్వాయ్‌కి వీరు రక్షణ కల్పించేవారని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top