కరోనా ఎఫెక్ట్‌.. దేవుని విగ్రహాలకు మాస్క్‌లు

Covid 19: Priest At Varanasi Temple Puts Face Mask On Idols - Sakshi

సాక్షి, వారణాసి : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్‌(కోవిడ్‌-19) ఇప్పుడు దేవుడిని సైతం భయపెడుతోంది. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు దేవుని విగ్రహానికి మాస్క్‌లు పెట్టారు ఓ పూజారి. అంతేకాదు భగవంతుని విగ్రహాన్ని భక్తులు ఎవరూ తాకరాదని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల విశ్వనాథ్‌ ఆలయంలో చోటు చేసుకుంది. ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే ఆలయంలోని విగ్రహానికి మాస్క్‌ కట్టినట్లు పూజరి వివరించారు.
(చదవండి : మూడేళ్ల చిన్నారికీ కోవిడ్‌)

‘ కరోనావైరస్ దేశవ్యాప్తంగా వ్యాపించింది. దీని గురించి అవగాహన పెంచడానికే విశ్వనాథ్ స్వామి విగ్రహం మీద మాస్క్ ఉంచాం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు విగ్రహంపై వస్త్రాన్ని  ఉంచుతాం.. వేడిగా ఉన్న సమయంలో మాస్క్‌ను కడుతాం’ అని పూజరి పేర్కొన్నారు.
(చదవండి : ఇప్పటివరకు 3,800 మంది మృతి)

అలాగే విగ్రహాన్ని ఎవరూ తాకరాదని విజ్ఞప్తి చేశారు. ‘ చేతులలో విగ్రహాన్ని తాకడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. భక్తులు స్వామివారిని చేతితో తాకితే.. కరోనావైరస్‌ ఎక్కువ మందికి సోకే ప్రమాదం ఉంది. కావున కొద్ది రోజుల వరకు భక్తులు విగ్రహాన్ని తాకరాదు’ అని పూజరి విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా వైరస్‌ గురించి అక్కడి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు. కాగా,  కోవిడ్‌ కారణంగా ప్రపంచం వ్యాప్తంగా ఇప్పటివరకూ 3,800 మంది మరణించారు. లక్షాపదివేల మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇక భారత్‌లో ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 44కు చేరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top