కొత్తగా 1,300 కరోనా కేసులు, 50మంది మృతి

Coronavirus:50 deaths, over 1,300 cases in 24 hours In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో భారత్‌లో మరో 50మంది మృత్యువాత పడ్డారు. మరో 1383 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం కరోనా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 19,984 పాటిజివ్ కేసులు నమోదు కాగా, 640 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక‍్టివ్‌ కేసులు 15,474 ఉన్నాయి. ఇక 3,870 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. (కరోనా: ఉప్పు తెచ్చిన ముప్పు! )

ఇక ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ రోజు రోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటివరకూ అక్కడ 5,218  కేసులు నమోదు అయ్యాయి. అలాగే 2,178 కరోనా కేసులతో గుజరాత్‌ రెండో స్థానంలో ఉంది. కేరళలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న ఒక్కరోజే అక్కడ 19 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది. (క్వారంటైన్లో ఉన్నా గైర్హాజరట!)

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు  25.55 లక్షలు దాటాయి. 1.77 లక్షల మంది మృతి చెందగా, 6.90 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్‌ కేసులు 8.18 లక్షలు దాటగా, నిన్న ఒక్కరోజే  25,607 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 2, 782మంది మరణించారు. (చైనా వైద్యులకు కరోనా టీకా !)

దేశాలు వారీగా...

  • అమెరికాలో కరోనాతో 45,296 మంది మృతి
  • స్పెయిన్‌లో 2,04,178 పాజిటివ్‌ కేసులు, 21,282 మంది మృతి
  • ఇటలీలో 1,83,957 పాజిటివ్‌ కేసులు, 24,648 మంది మృతి
  • ఫ్రాన్స్‌లో 1,58,050 పాజిటివ్ కేసులు, 20,796 మంది మృతి
  • జర్మనీలో 1,48,453 పాజిటివ్‌ కేసులు, 5,086 మంది మృతి
  • యూకేలో 1,29,044 పాజిటివ్‌ కేసులు, 17,337 మంది మృతి
  • టర్కీలో 95,591 పాజిటివ్‌ కేసులు, 2,259 మంది మృతి
  • ఇరాన్‌లో 84,802 పాజిటివ్‌ కేసులు, 5,297 మంది మృతి
  • చైనాలో 82,758 పాజిటివ్‌ కేసులు, 4,632 మంది మృతి
  • రష్యాలో 52,763 పాజిటివ్ కేసులు, 456 మంది మృతి
  • బ్రెజిల్‌లో 43,079 పాజిటివ్ కేసులు, 2,741 మంది మృతి
  • బెల్జియంలో 40,956 పాజిటివ్‌ కేసులు, 5,998 మంది మృతి
  • కెనడాలో 38,422 పాజిటివ్ కేసులు, 1,834 మంది మృతి
  • నెదర్లాండ్స్‌లో 34,134 పాజిటివ్ కేసులు, 3,916 మంది మృతి
  • స్విట్జర్లాండ్‌లో 28,063 పాజిటివ్‌ కేసులు, 1,478 మంది మృతి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top