చిగురుటాగులా వణుకుతోన్న మహారాష్ట్ర | Coronavirus : Maharashtra Reports 134 Fresh Cases | Sakshi
Sakshi News home page

కరోనా : కొత్తగా 134 కేసులు.. 127 మంది మృతి

Apr 12 2020 2:53 PM | Updated on Apr 12 2020 5:38 PM

Coronavirus : Maharashtra Reports 134 Fresh Cases - Sakshi

ముంబై :  కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర చిగురుటాగులా వణుకుతోంది.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా1761కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తాజాగా మరో 134 మందికి ఈ వైరస్‌ సోకింది. దీంతో ఇప్పటికి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1895కి చేరింది. ఆదివారం నమోదైన 134 కేసుల్లో ముంబైలో 113, పుణేలో 4, మీరా భయందర్‌లో 7, నావి ముంబైలో 2, తానే, వాసై విరార్‌,రైగా, అమరావతి, భివాండి, పింప్రీ-చిన్చ్వడ్‌లో  ఒక్కో ఒక్కో పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇక కరోనా బారినపడి మహారాష్ట్రంలో ఇప్పటి వరకు 127 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,356 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 1,035 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 273 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement