లాక్‌డౌన్‌ అంటే... 

Corona Virus: What is a lockdown? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్న మాట లాక్‌డౌన్‌. చైనాలోని వూహాన్‌ పట్టణంలో మొదలైన లాక్‌డౌన్‌ ప్రపంచ దేశాల మీదుగా ఇప్పుడు ఇండియానూ తాకింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ మాట వినబడుతోంది.  (కోవిడ్తో ఫ్రాన్స్ వైద్యుడు మృతి)

ఏమిటీ కథ.. 

►   లాక్‌డౌన్‌ అనేది ఓ అత్యవసర నిర్వహణ నియమం (ప్రోటోకాల్‌) 

►   సాధారణ పరిభాషలో దీని అర్థం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలను నివారించడం.  

► అధికార యంత్రాంగం మాత్రమే ఈ ప్రోటోకాల్‌ను ఉపయోగించే వెసులుబాటు ఉంటుంది.  

►  తమ పరిధిలోని ప్రజలను రక్షించడానికి పాలకులు ఈ ప్రోటోకాల్‌ను సాధారణంగా ఉపయోగిస్తారు.  

►   బాహ్య ప్రదేశాల నుంచి ఏదైనా ముప్పు ముంచుకు వస్తున్నప్పుడు లే దా ఇతర బాహ్య సంఘటన నుంచి రక్షించడానికి లాక్‌డౌన్‌ ప్రయోగిస్తారు. 

►    భవనాలలో లాక్‌డౌన్‌ అంటే తలుపులకు తాళాలు వేయడం. దీనివల్ల ఏ వ్యక్తి లోపలికి రారు, బయటికి పోరు. 

►    అలాగే, పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ (ఫుల్‌ లాక్‌డౌన్‌) అంటే సాధారణంగా ప్రజలు వారు ఉన్న చోటనే ఉండాలి.  (కరోనా పరిణామాలే కీలకం..!)

►    చెప్పిన చోటు నుంచి ఎవరూ లోపలికి వెళ్లకూడదు. బయటకు రాకూడదు.  

►    లాక్‌డౌన్‌ రెండు రకాలు. ఒకటి నివారణ లాక్‌డౌన్‌ (ప్రివెంటివ్‌ లాక్‌డౌన్‌), రెండోది ఎమర్జెన్సీ లాక్‌డౌన్‌. 

►    ప్రజలు, సంస్థల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా విధించేది ప్రివెంటివ్‌ లాక్‌డౌన్‌.  

►    అసాధారణమైన పరిస్థితి లేదా విపత్తును పరిష్కరించడానికి అమలు చేసే ముందస్తు చర్య ఇది. నివారణ చర్యలలో భాగం.  

►    ముంచుకొచ్చే ముప్పు తీవ్రతను తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం.  

►    ప్రాణాలకు తక్షణ ముప్పు లేదా ఇతరత్రా ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు ఎమర్జెన్సీ లాక్‌ డౌన్‌ను విధిస్తారు.  (కరోనా కట్టడి : లాక్డౌన్లు సరిపోతాయా?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top